బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
8వ తేదీన ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. 9వ తేదీ కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని చెప్పారు. 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.









