మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.వీరికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఏపీలో 140, తెలంగాణలో 115, హైదరాబాద్లో 22 సెంటర్లలో పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమై..సాయంత్రం 5.20 గంటలకు పరీక్ష ముగుస్తుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష రాయవచ్చు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తారు. అయితే 1.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే.. ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తున్నారు సిబ్బంది.ఇక ఎగ్జామ్ సెంటర్లలో NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.









