కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వ్యూహాలకు పదునుపెట్టి.. వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి.బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రచారం ముమ్మరం చేశాయి. మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని మోడీ.. సైతం రంగంలోకి దిగి భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో నిన్న భారీ రోడ్ షో నిర్వహించిన ప్రధాని.. నేడు కూడా రోడ్ షోను ప్రారంభించారు. దీంతో బెంగళూరు నగరం కాషాయమయం అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండోరోజు నిర్వహిస్తున్న రోడ్ షోతో బెంగళూరు నగరంలో కోలాహలం నెలకొంది.









