హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది.హెయిర్ డై తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది.ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.మృతురాలి స్వస్థలం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి.విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









