నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఆ వ్యక్తం ఎవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది? ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాల? అలాగే ఎవరైనా బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









