AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

700 ఏళ్ల నాటి ఈ కుర్చీలోనే చార్లెస్‌కు ప‌ట్టాభిషేకం..

లండ‌న్‌: మూడ‌వ‌ కింగ్ చార్లెస్‌కు ఇవాళ ప‌ట్టాభిషేకం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. సుమారు 700 ఏళ్ల క్రితం నాటి సింహాస‌నం(Coronation Chair)లో చార్లెస్‌కు ప‌ట్టాభిషేకం జ‌ర‌నున్న‌ది. ఈ కుర్చీలోనే ఆయ‌న ఆశీసులుకానున్నారు. మ‌ధ్య‌యుగ‌పు ఆ సింహాస‌నాన్ని ఈ వేడుక కోసం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. ఆ కుర్చీపై మ‌త‌ప‌ర‌మైన‌, ప్రాచీన సంప్ర‌దాయాల‌కు చెందిన ఎన్నో గుర్తులు ఉండ‌నున్నాయి. వెస్ట్‌మినిస్ట‌ర్ అబేలో జ‌రిగే వేడుక స‌మ‌యంలో చార్లెస్ ఈ సింహాస‌నంలోనే కూర్చుంటారు.

ఎడ్వ‌ర్డ్-1 ఆదేశాల మేర‌కు అప్ప‌ట్లో ఈ పీఠాన్ని త‌యారు చేశారు. 1272 నుంచి 1307 వ‌ర‌కు ఎడ్వ‌ర్డ్ 1 పాలించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌తి వేడుక‌లోనూ ఈ సింహాస‌నాన్ని వినియోగించారు. 18, 19వ శ‌తాబ్ధానికి చెందిన గ్రాఫిటీ వ‌ర్క్ ఆ చైర్‌పై ఉన్న‌ట్లు తెలుస్తోంది. 1800 ద‌శ‌కంలో ప్రిన్స్ అబ్బాట్ ఈ చైర్‌లోనే నిద్రించేవార‌ట‌. 1914లో జ‌రిగిన బాంబు దాడిలో ఈ చైర్ డ్యామేజ్ అయ్యింది.

కింగ్ చార్లెస్‌-3 ప‌ట్టాభిషేకం కోసం ఆ సింహాస‌నాన్ని గ‌త నాలుగు నెల‌ల నుంచి రిపేర్ చేస్తున్నారు. 1953లో క్వీన్ ఎలిజ‌బెత్‌కు ఈ చైర్‌లోనే ప‌ట్టాభిషేకం చేశారు. ప‌ట్టాభిషేక వేడుక‌ను చాలా త్వ‌ర‌గా ముగించ‌నున్నారు. కేవ‌లం రెండు వేల మంది అతిథులు మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. క్వీన్ ఎలిజ‌బెత్ ప‌ట్టాభిషేకానికి 8 వేల మంది అతిథులు హాజ‌ర‌య్యారు.

ANN TOP 10