AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆకాశాన్నంటిన బంగారం ధరలు..

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం మూడే రోజుల్లో తులం రేటు ఏకంగా రూ.1500 పెరిగింది. వెండి రేటు సైతం పసిడి దారిలోనే నడుస్తూ రికార్డులు తిరగరాస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం రేటు రికార్డు స్థాయికి చేరింది. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.57 వేల 200కు చేరింది. గత మూడు రోజుల్లో తులానికి రూ.1500 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు హైదారాబాద్‌లో తులానికి రూ.220 పెరిగింది. ప్రస్తుతం రూ.62 వేల 400 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.200 పెరిగి రూ. 57 వేల 350 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.220 పెరిగి ప్రస్తుతం ఢిల్లీలో రూ.62 వేల 550 పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ బంగారం ధరలు పెరగడం గమనార్హం. బ్యాంకింగ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతుండడం వల్ల బంగారంపై పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల పసిడి రేట్లు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2017.30 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.68 డాలర్ల మార్క్ దాటింది. మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చినప్పుడు ప్రస్తుతం రూ.81.745 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

ANN TOP 10