AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప‌ట్టాభిషేకంలో కింగ్ చార్లెస్ ధ‌రించే కిరీటాలు ఇవే..

బ్రిట‌న్ రాజు చార్లెస్‌కు ఇవాళ ప‌ట్టాభిషేకం(King Charles Coronation) నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌హావేడుక‌ను క్రైస్త‌వ సాంప్ర‌దాయం ప్ర‌కారం నిర్వ‌హించ‌నున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కింగ్ చార్లెస్‌కు ఇవాళ అధికారికంగా కిరీటాలు తొడ‌గ‌నున్నారు. వెస్ట్‌మినిస్ట‌ర్ అబే లో జ‌రిగే ఆ వేడుక‌లో ఆయ‌న‌కు రెండు కిరీటాల‌ను ధ‌రింప‌చేస్తారు. రాచ‌రిక సంప్ర‌దాయం ప్ర‌కారం మొత్తం మూడు కిరీటాల‌ను వాడ‌నున్నారు. అయితే మూడ‌వ కిరీటాన్ని క్వీన్ కామిల్లా ధ‌రిస్తారు. గ‌త సెప్టెంబ‌ర్‌లో క్వీన్ ఎలిజ‌బెత్ మృతి త‌ర్వాత బ్రిటీష్ సామ్రాజ్య బాధ్య‌త‌ల‌ను కింగ్ చార్లెస్ తీసుకున్న విష‌యం తెలిసిందే. బ్రిట‌న్ కాల‌మానం ప్ర‌కారం ఇవాళ 11 గంట‌ల‌కు ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వం ప్రారంభంకానున్న‌ది.

సెయింట్ ఎడ్వ‌ర్డ్స్ క్రౌన్‌..
కింగ్ చార్లెస్ ధ‌రించే తొలి కిరీటం సెయింట్ ఎడ్వ‌ర్డ్స్ క్రౌన్‌. ప‌ట్టాభిషేక స‌మ‌యంలో క్యాంట‌ర్‌బ‌రీకి చెందిన ఆర్చ్‌బిష‌ప్ ఈ కిరీటాన్ని చార్లెస్ శిర‌స్సుకు తొడ‌గ‌నున్నారు. కింగ్ చార్లెస్‌-2 కోసం ఆ కిరీటాన్ని 1661లో త‌యారు చేశారు. మ‌ధ్య యుగానికి ప్ర‌తీక‌గా నిలిచేందుకు ఆ కిరీటాన్ని 1649లో క‌ర‌గ‌దీసి కొత్త కిరీటంగా రూపొందించారు. ఇదే కిరీటాన్ని 1953లో చార్లెస్ త‌ల్లి ఎలిజ‌బెత్‌-2 ప‌ట్టాభిషేక స‌మ‌యంలో ఆమెకు తొడిగారు. ఆ కిరీటం బ‌రువు 2.2 కేజీలు ఉంటుంది. పూర్తిగా బంగారంతో త‌యారు చేశారు. దాంట్లో ప‌గ‌డాలు, ముత్యాలు, ఇంకా ర‌క‌ర‌కాల జెమ్స్ ఉన్నాయి.

ఇంపీరియ‌ల్ స్టేట్ క్రౌన్‌..
ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వం ముగింపు స‌మ‌యంలో.. సెయింట్ ఎడ్వ‌ర్డ్స్ క్రౌన్ స్థానంలో త‌క్కువ బ‌రువు ఉండే లైట‌ర్ ఇంపీరియ‌ల్ స్టేట్ క‌రీటాన్ని ధ‌రిస్తారు. ఇంపీరియ‌ల్ స్టేట్ క్రౌన్‌ను ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో వాడుతుంటారు. పార్ల‌మెంట్ ఓపెనింగ్ స‌మ‌యంలో ఈ కిరీటాన్నే ధ‌రిస్తారు. క్వీన్ ఎలిజ‌బెత్‌-2 అంత్య‌క్రియల స‌మ‌యంలో ఈ కిరీటాన్ని ధ‌రించారు.

ANN TOP 10