కర్ణాటక ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ ఉండటంతో.. పలు రాజకీయ పార్టీలో పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. భారీ మెజారిటీతో గెలిచి కర్ణాటకలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. అంతే స్పీడుగా ప్రచారంలో దూసుకుపోతుంది. కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల అగ్ర నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.నేడు ప్రధాని మోదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు.ప్రధాని రోడ్ షో కు కర్నాటక ప్రజలు పెద్దలు ఎత్తున తరలివచ్చారు. పూలుజల్లుతు ప్రధానికి స్వాగతం చెప్తున్నారు.బెంగళూరులో ప్రధాని మోదీ 26 కి.మీ. మేర రోడ్ షో చేయనున్నారు.









