AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోటాపోటీ నిరసనలు.. గాంధీభవన్ వద్ద హైటెన్షన్

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాంధీభవన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.గాంధీభవన్ కు బయల్దేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జిల్లాల్లోనూ బీజేపీ నాయకులను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.ఖమ్మం జిల్లాలో పార్టీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.కరీంనగర్ లో హనుమాన్ మాలాధారులను సైతం పోలీసులు చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మరోవైపు గాంధీభవన్ దగ్గర కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు కొనసాగిస్తున్నాయి.బీజేపీ చర్యలను నిరసిస్తూ మహిళ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా గాంధీ భవన్ గేటు వద్ద మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు.హనుమాన్ చాలీసా పఠించారు. ఇరు పార్టీల నిరసనలతో గాంధీభవన్ హైటెన్షన్ నెలకొంది.

ANN TOP 10