AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కల్తీ కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీ

ఎండాకాలం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీంల దందా జోరుగా కొనసాగుతుంది. ఇటీవల కోట్ల రూపాయలు విలువ చేసే కల్తీ ఐస్ క్రీంలను అధికారులు సీజ్ చేయగా.. తాజాగా జీడిమెట్లలోనూ ఈ బాగోతం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రం పై బాలానగర్ ఎస్ఓటి పోలీసుల దాడులు చేశారు.ఈ తనిఖీల్లో ప్రాణాంతక కెమికల్స్ ఉపయోగిస్తూ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హానికరమైన రసాయనాలను కలిసి.. డెలిషియస్ ఐస్ క్రీం పేరుతో అమ్మకాలు సాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దందా నిర్వహిస్తున్న ఫిరోజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి.. 15 లక్షల విలువ చేసే సామాగ్రి సీజ్ చేశారు.

ANN TOP 10