కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అంకోలాలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడలను కలిశారు. ఈ సమావేశంలో చోటు చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అంకోలా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పద్మ అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, తులసి గౌడ ప్రధాని మోడీ పాదాలను తాకడానికి ప్రయత్నించినప్పుడు.. ప్రధాని మోదీ తులసి గౌడను ఆపారు. అంతేకాదు ఇద్దరు మహిళలకు ప్రధాని మోదీ నమస్కరించి.. ఆశీర్వాదం కోరారు.









