AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రసాభాసగా జీహెచ్​ఎంసీ సమావేశం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సర్వసభ్య సమావేశం ప్రారంభం అయింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యతన సమావేశం ప్రారంభం కాగా.. బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రితీలో మీటింగ్‌కు హాజరయ్యారు. లైఫ్ జాకెట్ల్, స్విమ్మింగ్ ట్యూబ్, ఫైర్, Fire Extinguisherతో సమావేశానికి హాజరై నిరసన తెలిపారు. మొన్నటికి మొన్న మౌనిక నాలాలో పడి మృతి చెందిన ఘటనను, నిన్న జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల చిన్నారి వివేక్ నీటిగుంతలో పడి మృతి చెందిన విషయాన్ని జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో పేర్కొనలేదంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరంలో వరుస కుక్కకాట్లు, దోమలు, వరదలు, ప్రజల ప్రాణాలను తీస్తున్న నాలాలపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొద్దిపాటి వర్షానికే నగరం మెుత్తం జలమయమవుతోందని ఆందోళన చేపట్టారు. మస్కిటో వేషాదరణలో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇకనైనా మొద్దు నిద్ర వదిలి నగరంలోని పెండింగ్ నాలా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అస్థవ్యస్థమైన డ్రైనేజీ వ్యవస్థ తక్షణమే సరిదిద్ది.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. గత కొద్ది రోజులుగా నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న బల్దియా మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

జీహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంది కానీ.. పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోతుందని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఇకనైనా మెుద్దనిద్ర వీడి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు. లేందటే రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి లైఫ్ జాకెట్లు, బోట్లు జీహెచ్‌ఎంసీనే ఇవ్వాల్సి వస్తుందని అన్నారు.

ANN TOP 10