హైదరాబాద్: నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ తరుపున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. గత నెల 29వ తేదీన కురిసిన భారీ వర్షం నేపథ్యంలో కలాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.









