AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వచ్చే 48 గంటల్లో ‘మోచా’ వచ్చేస్తోంది..!

ఇప్పటికే అకాల వర్షాలతో అన్నదాత కంటతడి పెడుతుంటే.. మరో పిడుగు లాంటి వార్త రైతులను మరింత భయపెడుతోంది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుందంటూ ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. తుఫాన్‌ ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉంది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 6వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఒడిశా, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

తుపాను మోచా..
తుపాను ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు. గత సంవత్సరం ఇదే మే నెలలో అసాని తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. అయితే రాగల 48 గంటల్లో ఏపీ వాతావరణంలో భారీ మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

అన్నదాతను వదలని అకాల వర్షం..
భారీ వర్షానికి కళ్లాల్లో వున్న వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది.కోతకు సిద్ధంగా ఉన్న వరి, కోసి ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. పొలాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి.

ANN TOP 10