బెంగళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం(Bangalore Cantonment – Visakhapatnam)ల మధ్య నడిచే 08544 వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైలు(Weekly Express Special Train)ను పునరుద్ధరిస్తున్నట్లు నైరుతి రైల్వే ప్రకటించింది. ఈ మేరకు నగరంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు మే 8 నుంచి మే 29 వరకు సంచరించనుంది.
బెంగళూరు కంటోన్మెంట్‌లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50కు బయల్దేరి కృష్ణరాజపురం, బంగార పేట, కుప్పం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ(Renigunta, Gudur, Nellore, Ongole, Vijayawada), గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడల మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.









