అక్రమ క్యాసినో కింగ్‌గా చెప్పుకునే చికోటి ప్రవీణ్‌ని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పటాయి ప్రాంతంలో ఓ లేడీ కలిగివున్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో గ్యాంబ్లింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో థాయిలాండ్ పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో మొత్తం 93 మంది అరెస్ట్ అయినట్లు తెలిసింది. వారిలో 16 మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. గెస్ట్ హౌస్‌ని నిర్వహిస్తున్న కెల్వెల్కర్ అనే మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్టైన వారిలో చాలా మంది భారతీయులేనని తెలిసింది.
ఈ రైడ్‌లో పోలీసులు భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ చిప్స్ విలువ 20 కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలిసింది. ఈ రైడ్‌లో భారీగా మొబైల్స్, థాయ్ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పట్టుబడిన భారతీయుల్ని చికోటి ప్రవీణ్.. టూరిజం పేరుతో థాయిలాండ్ తీసుకెళ్లారని తెలుస్తోంది. మూడు రోజుల టూరిజం కోసం రూ.3 లక్షల చొప్పున వారి నుంచి చికోటి ప్రవీణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో భారతీయులతోపాటూ… మయన్మార్, థాయిలాండ్‌కి చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది.









