కార్మిక పక్షపాతి.. అజాత శత్రువు
కార్మిక నేత సామ శ్రీనివాస్‌రెడ్డి
మణుగూరు: ఉమ్మడి వరంగల్ జిల్లా పెదనాగరం గ్రామానికి చెందిన తన తండ్రి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను ఎదిరించి జైలు పాలయ్యారు. జైల్లో అధికారులపై తిరగబడి గోడ దూకి చెరువులో ఈదుకుంటూ బయటపడ్డారు. పది సంవత్సరాలు అజ్ఞాతవాసం గడుపుతూ పోరాటంలో పాల్గొన్నారు. అనంతరం అశ్వాపురం వలస వచ్చారు. రజాకారులు ఎదిరించిన ధీరత్వం, కొడుకు సామ శ్రీనివాస్‌రెడ్డి ఆప్యాయతకు, అనురాగాలకు మారుపేరు మానవత్వానికి మంచి తనానికి నిలువెత్తు నిదర్శనం. నిస్వార్థంగా కార్మికులకు సేవ చేస్తూ, ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, కార్మిక పక్షపాతిగా, అజాత శత్రువుగా మణుగూరు మండల ప్రజలు, కార్మికుల హృదయాలలో స్థిర స్థాయిగా నిలిచిపోయే నాయకుడు సామ శ్రీనివాస్‌రెడ్డి. సిరుల తల్లి సింగరేణి సంస్థలో 34 సంవత్సరాల 8 నెలల 20 రోజులు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న సామ శ్రీనివాస్‌రెడ్డిపై ప్రత్యేక కథనం.
స్వగ్రామం అశ్వాపురం మండలం రామచంద్రాపురం. తల్లిదండ్రులు భిక్షంరెడ్డి, సత్తెమ్మ. విద్యాభ్యాసం నెల్లిపాక పాల్వంచలలో కొనసాగింది. ఐటీఐ పూర్తి అయిన తరువాత 1989లో సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌గా ఉద్యోగంలో చేరారు. సుమారు 35 సంవత్సరాలు సీనియర్ టెక్నీషియన్‌గా అనేక ప్రశంసలు పొందారు. మణుగూరు ఏరియాలో ఏసీ ఫంక‌్షన్ హాలులో నిర్మించాలని, తన హయాంలోనే అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చానని దానిని సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. అంబేడ్కర్ పార్కుకు వెలుగులు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐఎన్‌టీయూసీలు క్రియాశీలక పాత్ర పోషించారు. వెంకట్రావు జనప్రసాద్ సారథ్యంలో పనిచేశారు. ఐఎన్‌టీయూసీ ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి తెలంగాణ సాధించాలన్న కాంక్షతో ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శిగా, వైఎస్ ప్రెసిడెంట్‌గా వివిధ పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుతం స్టేట్ ఎలెవన్ నంబర్ కమిటీ సభ్యుడిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై నమ్మకంతో అధికారులు అనేక సమస్యలు పరిష్కరించారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మణుగూరు ఏరియా కార్మికులకు అధికారులకు రుణపడి ఉంటానని తెలిపారు.









