AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక్కడి గజినీలకు అర్థంకావడంలేదు

సంగారెడ్డి: హైదరాబాద్‌లో ఉన్నానా లేక.. న్యూయార్క్‌లో ఉన్నానా అనేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అయితే ఇక్కడి అభివృద్ధి పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీకాంత్‌కు అర్ధమవుతుంది కానీ.. ఇక్కడ ఉన్న గజినీలకు అర్ధం కావట్లేదని విరుచుకుపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది (మం) కాశీపూర్‌లో పర్యటించిన మంత్రి కాశీపూర్‌లో బసవ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్‌ను దించేస్తామని అంటున్నాయని.. అసలు కేసీఆర్‌ను ఎందుకు దించాలని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్‌ను ఎందుకు దించుతారని నిలదీశారు.

‘రైతుకు నగలు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్.. అందుకు కేసీఆర్‌ను గద్దె దించుతారా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్‌ను దించేస్తారా’ అంటూ నిలదీశారు. లింగాయత్‌లను ఓబీసీల చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపామని తెలిపారు. ఓబీసీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవట్లేదని విమర్శించారు. లింగాయత్‌లను ఓబీసీలో చేర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్‌లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత కేసీఆర్‌ది అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

ANN TOP 10