AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు- ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కున్న మహిళ

చీరాల: రేల్వే స్టేషన్ లో కదులుతున్న రైలును ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మహిళ జారి పడి రైలు-ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుంది. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరెడు గ్రామానికి చెందిన కట్టా తిరుపతమ్మ విజయవాడ నుంచి గూడురు ఎక్స్ ప్రెస్ ను స్టేషన్ లో ఎక్కేందుకు ప్రయత్నించగా రైలు కదిలింది.

దీంతో తిరుపతమ్మ కాలు జారి ప్లాట్ ఫాం-రైలు మధ్యలో ఇరుక్కుంది. ఇది గమనించిన రైల్వే పోలీసులు రైలును ఆపారు. స్థానికులు, రైల్వే పోలీసులు కొన్ని గంటలు కష్టపడి తిరుపతమ్మ ను బయటకు తీశారు. ఈ ఘటనలో తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో రేల్వే పోలీసులు ఆమెను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ANN TOP 10