ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ప్రముఖ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్‌దీప్ ధల్ పేర్లను ప్రస్తావించి వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో అమన్‌దీప్ అరెస్ట్ అయిన 60 రోజులు కావస్తుండటంతో.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అమన్‌దీప్‌తో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లైను కూడా అరెస్ట్ చేయడంతో ముగ్గురి పేర్లతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది.
ఇప్పటివరకు మొత్తం ఈ కేసులో ఈడీ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనే దానిపై శుక్రవారం స్పెషల్ జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం దీనిపై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ ముగ్గురి పాత్ర గురించి ఈ ఛార్జిషీట్‌లో స్పష్టంగా ఈడీ పేర్కొంది. ఈడీ కేసులో గతంలో మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 29 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించారు. రేపటితో కస్టడీ ముగియనున్న క్రమంలో ఇవాళ స్పెషల్ కోర్టులో చార్జిషీట్‌పై విచారణ జరగనుంది.









