నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో బీఆర్ఎస్ ది ప్రత్యేక చర్రిత. బీఆర్ఎస్ ఆవిర్భావ ఉద్యమం, ఉద్యమ సాఫల్య, రాష్ట్ర సాధన, అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, సుపరిపాలనలోనూ అంతకంటే ప్రత్యేకమైన చరిత్రనే ఆ పార్టీ లిఖిస్తున్నది. ఆ పార్టీ అధినేత, ఉద్యమసారథి. ప్రస్తుత ప్రభుత్వ రథ సారథి సిఎం కెసిఆర్ తరచూ చెప్పే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ లో అవే త్యాగాల పునాదుల మీద టిఆర్‌ఎస్ పుట్టి, పెరిగి, పెద్దదై, పరిపాలన సాగిస్తున్నది.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ భవన్ లో ఉదయం11 గంటలకు పార్టీ జెండాను ఎగరేసి సమావేశాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దేశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పలు తీర్మానాలపై చర్చ జరగనుంది.









