సినీ నటి పూజా హెగ్దే కాస్త దువ్వాడ జగన్నాథం నుంచి లక్కీ బేబీ గా మారిపోయింది. అభినయంలో అటు ఇటుగా ఉన్నా గ్లామర్ షోలో తగ్గేదేలే అనిపించేస్తున్న పూజా హెగ్దే తెలుగు కెరీర్ మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. అల్లు అర్జున్ తో మొదలు పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం మహేష్ తో మరోసారి కలిసి జత కడుతుంది పూజా. ఆల్రెడీ మహర్షి సినిమాలో మహేష్ తో నటించింది అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ వేర్ లో ఉన్న కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఫిదా అవుతున్నారు .









