ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు అమృత్‌పాల్ సింగ్‌ను (Amritpal Singh) పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్‌ను ఆదివారం ఉదయం పంజాబ్‌లోని మోగా జిల్లాలో (Moga district) ఉన్న గురుద్వారా వద్ద (Gurudwara) అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ భద్రత చట్టం (National Security Act) కింద ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆయనను అసోంలోని (Assam) డిబ్రూగఢ్ (Dibrugarh) జైలుకు తరలించనున్నట్లు తెలిపారు. అమృత్‌పాల్ అరెస్టు నేపథ్యంలో ప్రజలందరు శాంతి భద్రతలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఫేక్ న్యూస్ సృష్టించొద్దని విజ్ఞప్తిచేశారు.
అప్పటినుంచి తప్పించుకుతిరుగుతున్న అతడి ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తీవ్రంగా గాలింపు చేపట్టారు. 37 రోజుల తర్వాత అతడు పోలీసులకు చిక్కడం గమనార్హం. అమృత్‌పాల్‌ను ఖలిస్థానీ వేర్పాటువాదిగా, పాకిస్థాన్ ఏజెంట్‌గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.









