వివేకా హత్యకు సంబంధించిన అసలు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నారని తెదేపా నేత పట్టాభిరామ్ ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలను ఆయన లేవనెత్తారు. వివేకా హత్య వెనుక జగన్ కుటుంబం పాత్ర ఉందని, వారి ఆధ్వర్యంలోనే వివేకా హత్య అతి కిరాతకంగా జరిగిందని పట్టాభి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సొంత మీడియా ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి రాతలు రాస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, మున్ముందు చంచల్‌గూడ జైలులోనే జగన్ కాపురం చేస్తారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.









