ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్‌పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.









