టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తుండగా.. నరేశ్, మురళీ శర్మ, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్రాంతి సినిమాల పోటీపై శ్రీవిష్ణుకు ప్రశ్న ఎదురైంది. ఈ సంక్రాంతికి పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు విడుదలవుతున్న నేపథ్యంలో పోటీని ఎలా చూస్తున్నారని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి స్పందించిన శ్రీవిష్ణు.. అవన్నీ పెద్ద సినిమాలని, వాటితో తమకు ఎలాంటి పోటీ లేదని సరదాగా వ్యాఖ్యానించారు.
“అవన్నీ పెద్ద సినిమాలు. మేము అసలు పోటీలోనే లేము. ఈ సంక్రాంతికి మాకు ఓ స్పేస్ దొరికింది. అందుకే జనవరి 14న వస్తున్నాం. సినిమా ఫస్టాఫ్‌ను యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. సినిమాలో యాక్షన్ కూడా ఉంటుంది. అయితే అది కేవలం డైలాగ్స్‌తోనే ఉంటుంది” అంటూ శ్రీవిష్ణు నవ్వులు పూయించారు.








