AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీ20ల్లో ప్రియాంశ్ ఆర్య విధ్వంసం.. 68 బంతుల్లో 181 పరుగులు!

భారత యువ క్రికెటర్, ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య టీ20 క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు సాధించాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ స్థాయిలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు లుహాన్-డ్రే ప్రిటోరియస్ గత నెలలో సాధించిన 188 పరుగుల రికార్డుకు ఆర్య ఏడు పరుగుల దూరంలో నిలిచాడు.

ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆర్య అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆర్య కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం తన దూకుడును కొనసాగిస్తూ 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.

సెంచరీ తర్వాత కూడా ఆర్య వేగం తగ్గించలేదు. మరో 24 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్‌లో భారత ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నమోదైంది.

ANN TOP 10