AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా.. EPFO 3.0లో కొత్త సదుపాయం!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవాలంటే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే త్వరలో యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. ఈ కొత్త విధానాన్ని EPFO 3.0లో భాగంగా అమలు చేయనున్నారు.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సేవను డిసెంబర్ 2026లో ప్రారంభించే అవకాశం ఉంది. 2027 ఫిబ్రవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సదుపాయానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేసినట్లు, ట్రయల్స్ కూడా దాదాపు పూర్తయినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది.

ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే పీఎఫ్ సభ్యులు నగదు ఉపసంహరణ కోసం క్లెయిమ్ ప్రక్రియపై ఆధారపడాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. యూపీఐ ద్వారా వేగంగా, సులభంగా డబ్బులు పొందేందుకు వీలుకలగవచ్చు. అయితే ఉపసంహరణ పరిమితులు, అర్హతలు, అమలు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను EPFO అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ANN TOP 10