AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవంబర్ 25న కొత్త రూపంలో టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సిద్ధం!

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన టయోటా.. భారత కార్ మార్కెట్‌లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లతో ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీ విభాగాల్లో మంచి ఆదరణ పొందుతోంది. నాణ్యత, మన్నిక, అధునాతన టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు విభిన్న మోడళ్లను అందిస్తోంది.

ఈ నేపథ్యంలో తన పాపులర్ ఎమ్‌పీవీ ఇన్నోవా హైక్రాస్‌ను సరికొత్త రూపంలో తీసుకొచ్చేందుకు టయోటా సిద్ధమైంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నవంబర్ 25న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త మోడల్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయనే అంశంపై వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హైబ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రిఫికేషన్‌పై టయోటా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇన్నోవా హైక్రాస్ కొత్త వెర్షన్‌లో డిజైన్‌తో పాటు ఇతర ఫీచర్లలోనూ అప్‌డేట్లు ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ANN TOP 10