AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కార్తీక పౌర్ణమి ఉపవాసం తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

కార్తీక మాసంలో చాలామంది భక్తులు శివుడు, విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉపవాసాలు ఆచరిస్తారు. కొందరు కార్తీక సోమవారాల్లో మాత్రమే ఉపవాసం ఉంటే, మరికొందరు నెలంతా నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, పూజలు పూర్తిచేసిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఉపవాసం ముగిసిన వెంటనే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

ఉపవాసం తర్వాత ముందుగా కొద్దిగా నీరు లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత అరటిపండు, బొప్పాయి వంటి తేలికగా జీర్ణమయ్యే పండ్లు తినవచ్చు. అలాగే పెరుగు అన్నం, మెత్తని అన్నం, పప్పు, కూరగాయలతో చేసిన తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా కొద్దికొద్దిగా తినాలి.

ఉపవాసం విరమించిన వెంటనే నూనె పదార్థాలు, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు, వేయించిన వంటకాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే టీ, కాఫీని ఎక్కువగా తాగకూడదు. రోజంతా ఉపవాసం ఉన్నవారు శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మధుమేహ బాధితులు ఉపవాసాల విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ANN TOP 10