AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న దీపక్ హారీక్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)గా గుర్తించారు. వీరు హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు.

అపార్ట్‌మెంట్‌లో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన కార్మికులు విషవాయువుల ప్రభావంతో ఊపిరాడక స్పృహ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ట్యాంక్‌లోకి దిగడంతో ప్రమాద తీవ్రత పెరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

తోటి కార్మికులు, అపార్ట్‌మెంట్ వాసులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో భద్రతా చర్యలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ANN TOP 10