AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జియో నుంచి హ్యాపీ న్యూ ఇయర్ 2027 ఆఫర్లు.. రూ.399 నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. టెలికాం రంగంలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2027’ పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా రూ.399తో ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌ను, ఏడాది వ్యాలిడిటీతో కూడిన రూ.3,999 ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు పలు ఓటీటీ సేవల ప్రయోజనాలు కూడా లభించనున్నట్లు సమాచారం.

వీటితో పాటు తక్కువ ధరలో 5G డేటా యాడ్‌-ఆన్ ప్యాక్‌లు, రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక డేటా ప్యాక్‌ను కూడా జియో తీసుకొచ్చింది. కొత్త ప్లాన్లకు సంబంధించిన పూర్తి ప్రయోజనాలు, నిబంధనలు తెలుసుకునేందుకు వినియోగదారులు జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌ను పరిశీలించవచ్చు.

ANN TOP 10