AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

కడప: నగర శివారుల్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు లక్షణమ్మ(66), నర్సయ్య(58), రాజారెడ్డి(45), చిన్నక్క(60)గా గుర్తించారు. మృతులు కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వారిగా గుర్తించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపైన వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ANN TOP 10