నిజామాబాద్ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) లో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదేనా సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతున్న తెలంగాణ మోడల్? అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఆస్పత్రిలో వసతుల లేమీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. రోగిని బంధువులు ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ (BRS) సర్కార్ అరాచక పాలన ఫలితమే ఈ ఘటన అని రేవంత్‌రెడ్డి అన్నారు.
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో గత నెల 31న ఓ రోగి చేరాడు. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రి రెండో అంతస్తుకు వెళ్లాల్సి ఉండగా.. అక్కడ స్ట్రెచర్ లేక రోగిని బంధువులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. లిఫ్ట్ వరకు రోగి కాళ్లుపట్టుకుని బంధువులు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి. రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది సాయం చెయ్యకపోవడంతో, ఆస్పత్రి సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోగులకు అందుబాటులో స్ట్రెచర్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.









