AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబేడ్కర్‌పై కేసీఆర్‌ది కపట ప్రేమే

హైదరాబాద్: అంబేద్కర్ విగ్రహం (Ambedkar Statue) ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్‌పై కేసీఆర్‌ది కపట ప్రేమేనని అన్నారు. రిజర్వేషన్‌లు ఇచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీనే అసలైన దళిత బంధు అని అన్నారు. సబ్ ప్లాన్ నిధులు (Sub Plan Funding) ఖర్చు పెట్టని బీఆర్ఎస్ (BRS) ఎలా దళిత బంధు అవుతుందని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే సీఎం కేసీఆర్ (CM KCR) బంధువో.. రాబందువో తెలుస్తోందన్నారు. అంబేద్కర్ పెద్ద విగ్రహం పెట్టినంత మాత్రాన సీఎం కేసీఆర్ దళిత బంధు కారని.. సొంత డబ్బుతో విగ్రహం పెట్టారా? అని నిలదీశారు.

ANN TOP 10