AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ నుంచి టూరిస్ట్ రైలు ప్రారంభం

న్యూఢిల్లీ: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐఆర్‌సీటీసీ(IRCTC), కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ సంయుక్తంగా అంబేద్కర్ సర్క్యూట్ టూరిస్ట్ రైలును(Ambedkar Circuit Tourist Train) ప్రారంభించాయి. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 8 రోజుల పాటు సాగనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రను(Bharat Gaurav Yatra) కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, వీరేంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ రైలు యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభమై మహారాష్ట్ర, బీహార్ ల మీదుగా సాగనుంది. ఈ ప్రత్యేక యాత్ర రైలు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి నాగపూర్, బుద్ధ క్షేత్రాలైన సాంచి, సారనాథ్, గయ, రాజ్ గిర్, నలంద, భీం జన్మభూమి ఎంహౌల మీదుగా సాగనుంది.

ANN TOP 10