AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు

కేసీఆర్‌ దళిత ద్రోహి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ దళిత ద్రోహి అని, ఆయనకు విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కేసీఆర్‌ ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న కారణంగానే అంబేడ్కర్‌ విగ్రహం పేరిట రాజకీయాలకు తెర లేపారని బండి సంజయ్‌ విమర్శించారు. కాగా ప్రధాని మోదీ పాలనలో పథకాలు దళితులకు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.

ANN TOP 10