AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేయడంతో రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడకుండా, తమ హక్కుల సాధన కోసం ఈసారి వెనక్కి తగ్గకూడదని కార్మిక సంఘాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.

ఆర్టీసీ జేఏసీ ప్రధానంగా సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) బకాయిలు మరియు రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్ల పాత బకాయిలను కోతలు లేకుండా తక్షణమే మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి రెండు వారాల్లోపు సానుకూల స్పందన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా బస్సు చక్రం ఆపివేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద భారీ దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, పనిభారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ANN TOP 10