AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీ సాక్షిగా నెయ్యి కల్తీ నిజాలు బయటపెడతాం: వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

అసెంబ్లీ వేదికగా వాస్తవాల వెల్లడి: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదానికి జరిగిన అపచారానికి సంబంధించిన పూర్తి ఆధారాలను, వాస్తవాలను త్వరలోనే అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం, చట్టసభల్లో దేవుడి ఫోటోలతో నిరసనలు తెలపడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా సభకు వచ్చి చర్చల్లో పాల్గొనాలి తప్ప, అసెంబ్లీకి రావాలని ఎవరికీ ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని వైసీపీ సభ్యులకు చురకలు అంటించారు.

హెరిటేజ్ ఆరోపణలపై క్లారిటీ: తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌పై వస్తున్న ఆరోపణలను లోకేష్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డెయిరీకి ఎటువంటి యాజమాన్య సంబంధాలు లేవని, అది కేవలం కో-ప్యాకర్ మాత్రమేనని వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ వంటి సంస్థలు రూ.1,000 కోట్ల మేర ప్రజాధనంతో లబ్ధి పొందాయని, కానీ తమ సంస్థ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని పేర్కొన్నారు. కిలో వెయ్యి రూపాయలు ఉండే నెయ్యిని కేవలం రూ.360 కే కొనుగోలు చేయడం ద్వారానే గత పాలకులు నాణ్యతను బలిపెట్టారని ఆయన విమర్శించారు.

జగన్ వ్యాఖ్యలకు సెటైరికల్ కౌంటర్: క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని వివరిస్తూ, టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు భారత్ వెళితే తాను తప్పకుండా మ్యాచ్ చూడటానికి వెళ్తానని లోకేష్ తెలిపారు. తన ప్రయాణాలపై విమర్శలు చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే (జగన్) కూడా మ్యాచ్ చూడటానికి వస్తానంటే, ఆయనకు కూడా టికెట్ తానే కొని ఇస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో తాను మ్యాచ్ చూడటానికి శ్రీలంక వెళ్లడంపై జగన్ చేసిన కామెంట్లకు ఈ విధంగా సెటైర్ వేశారు. రాజకీయేతరంగా తాను నిర్వహిస్తున్న ఆత్మీయ భేటీలు కేవలం కార్యకర్తల కుటుంబాలతో సంబంధాలను బలపరుచుకోవడానికేనని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10