AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కళ్యాణ్ ‘స్లో అండ్ స్టడీ’ వ్యూహం: పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

జనసేన పార్టీ స్థాపించి దశాబ్దం దాటినా, క్షేత్రస్థాయిలో పార్టీని ఆశించిన స్థాయిలో ఎందుకు బలోపేతం చేయడం లేదన్న ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయ వ్యూహమే సమాధానమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని ఇప్పుడే భారీగా విస్తరిస్తే, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడి, ఆశావహుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, అధికారాన్ని ఉపయోగించి ముందుగా తన ఇమేజ్‌ను మరియు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన యోచిస్తున్నారట.

గత ఎన్నికల్లో కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 100 శాతం విజయం సాధించడం పవన్ వ్యూహకర్తగా సాధించిన గొప్ప విజయం. అయితే, ఆ తక్కువ స్థానాల్లోనే సరైన అభ్యర్థుల కోసం వెతకాల్సి రావడం ఆయనను ఆలోచనలో పడేసింది. శక్తికి మించిన సీట్లు తీసుకుని ఓటమి పాలవ్వడం కంటే, తనకు బలం ఉన్న చోట పట్టు నిలుపుకోవడం ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అందుకే జిల్లాల పర్యటనలు కూడా పరిమితంగా చేస్తూ, 2029 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో మరికొన్ని అదనపు సీట్లతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ పదే పదే “చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి” అని కోరడం వెనుక కూడా ఇదే దూరాలోచన ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హడావుడిగా ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడి పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకోవడం కంటే, క్రమంగా బలాన్ని పెంచుకుంటూ ‘స్లో అండ్ స్టడీ’ పద్ధతిలో రేసులో గెలవాలన్నది ఆయన అసలు ప్లాన్. ఈ వ్యూహం తెలియని వారు విమర్శలు చేస్తున్నా, పవన్ మాత్రం తనదైన శైలిలో నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నారు.

ANN TOP 10