AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బీ-5 బోగీలో నుంచి పొగలు రావటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయాబ్రాంతులకు గురయ్యారు. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

పొగలు రావటానికి కారణాలు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావటంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో కావలి రైల్వే స్టేషన్‌లోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఈ ఘటనతో ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

ANN TOP 10