గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్(RRR ) సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య సోలో హీరోగా వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Change). భారీ అంచనాల మధ్య కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్. అందులో భాగంగానే ఆయన బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మైదానంలో క్రికెట్ ఆడుతున్న రామ్ చరణ్
ఇందులో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్నాడు ఈ వీడియో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. ఇకపోతే ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Siva Raj Kumar) ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అర్ధరాత్రి కూడా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజా షెడ్యూల్లో భాగంగా చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటుంది. ఇప్పటికే శివరాజ్ కుమార్ తన పాత్ర కోసం లుక్ టెస్ట్ కూడా ముగించుకున్నారని, త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో ఆయన భాగం కాబోతున్నట్లు సమాచారం.
ఆర్ సి 16 నుండి వీడియో లీక్..
ఇక ఇలా భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నట్లు సమాచారం.రామ్ చరణ్ ఇందులో క్రికెట్ ప్లేయర్గా, కుస్తీ ఆటగాడిగా కూడా పలు రకాల ఆటలు వచ్చిన యువకుడిగా కనిపించనున్నారట. దీంతో రాంచరణ్ పాల్గొన్న క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు పూర్తి చేశారు. ఈ సమయంలో ఎవరో తమ సెల్ ఫోన్ కి పని చెప్పి రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అలా మొత్తానికైతే సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ వీడియోలో ఒక మైదానంలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి అయితే రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ వీడియోని తమకు నచ్చిన వారికి షేర్ చేస్తూ తెగ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో జగపతిబాబు(Jagapati babu), మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫ్రేమ్ దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman)ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుఆర్ సీ16 నుండి వీడియో లీక్.. న్నారు.