మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫంకీ’ చిత్రం, విడుదలైన మొదటి ఆట నుంచే ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాలను పక్కన పెట్టి, ఇప్పుడు మాస్ కా దాస్ తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 100 మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న మూడో చిత్రం ‘కల్ట్’ (Cult). ఈ సినిమాతో దర్శకుడిగా మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు విశ్వక్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ లాంచ్ వేడుకకు అందరికీ ఆహ్వానం పలికారు మాస్ కా దాస్. ఆ ఆహ్వానం ఎంత వినూత్నంగా ఉందంటే.. తేడా వస్తే ఎక్కేటోళ్లు కూడా ఈ టీజర్ స్క్రీనింగ్‌కు రావాలని ఆయన ఆహ్వానం పలికారు. విశ్వక్ తన ప్రకటనలో..
తేడాలొస్తే ఎక్కేటోళ్లు కూడా రావచ్చు
‘‘హలో గైస్ నమస్తే.. ఈ శనివారం నాకు చాలా ముఖ్యమైన రోజు. నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ‘కల్ట్’ టీజర్ విడుదల కాబోతోంది. ఐమాక్స్‌లో శనివారం సాయంత్రం 3 గంటలకు స్క్రీనింగ్ చేయబోతున్నాం. అందుకే మిమ్మల్నందరినీ కోరుతున్నది ఏమిటంటే.. అంతా ఈ టీజర్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడాలని. ఇది మెచ్యూర్డ్ ఆడియెన్స్ కోసమే. ఒక డైరెక్టర్‌గా చెబుతున్నా.. ఇది ఇండియాస్ ఫస్ట్ స్లాషర్. వీడు ఫస్ట్ స్లాషర్ అని అంత ప్రౌడ్‌గా ఎందుకు వేసుకున్నాడు? అని.. తేడాలొస్తే ఎక్కేటోళ్లు కూడా ఈ వేడుకకు రావచ్చు. వీటన్నింటికీ బిగ్ స్క్రీన్ సాక్ష్యం కాబోతోంది. కల్ట్ యాక్టర్స్ అందరినీ మరోసారి స్పెషల్‌గా వేడుకుంటున్నాను. ఈ సినిమాతో దాదాపు 100 మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. నేను కూడా ఈ కల్ట్ ఫ్యామిలీలో ఒకడిని. మీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని రండి.. థియేటర్‌లో కలుసుకుందాం’’ అని విశ్వక్ సేన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
‘మ్యాడ్’ తరహాలో ముగ్గురి యువకుల కథ
ఇంతకు ముందు అంటే అప్పుడెప్పుడో విశ్వక్ ఈ ‘కల్ట్’ గురించి చెబుతూ.. రియల్‌గా జరిగిన ఓ సంఘటనను బేస్ చేసుకుని ఈ కథ రాశాను.లైఫ్‌లో ఓడిపోయిన ముగ్గురు యువకులు ఏం చేశారనేదే ఈ కథ. చాలా మంచి పాయింట్. ఈ కథ అనుకుని, రాస్తున్నప్పుడు.. ఇదొక ‘కల్ట్’ సినిమా కావాలని అంతా అనుకున్నాం. అలా ఈ సినిమాకు ‘కల్ట్’ అనే టైటిల్ పెట్టేశాం. ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇస్తున్నాను. ‘మ్యాడ్’ తరహాలో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అన్నారు. అదన్నమాట మ్యాటర్.








