AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయాల పై చిరంజీవి కీలక వాఖ్యలు..

మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాని ఏలుతున్న రారాజు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ప్రతి ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నట్లు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. మెగాస్టార్ కెరియర్ లో ఎప్పటికీ చెరిగిపోని మచ్చ మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశం. ప్రజారాజ్యం అనే ఒక పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ ప్రస్తానాని అప్పట్లో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీని ఎక్కువ కాలం కొనసాగించలేక కాంగ్రెస్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి కలిపేశారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉండేవాళ్ళు.

 

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కొన్నేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, రీయంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. అయితే చిరంజీవి తన కెరీర్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉన్నారో, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్న ప్రతి ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. రీసెంట్ గా లైలా ఫంక్షన్ లో కూడా ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారింది అంటూ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం రాజకీయాల గురించి మరో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి.

 

బ్రహ్మానందం, గౌతమ్ కీలక పాత్రలో నటించిన సినిమా బ్రహ్మానందం. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ” ఈ జన్మంతా ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. ఆ కళామ్మ తల్లి తోనే ఉంటాను. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తానేమో అని, కొన్ని సేవలు అందించడం మాత్రమే చేస్తాను తప్ప మళ్ళీ పొలిటికల్ గా ఎంట్రీ అవ్వడం లేదు. మళ్లీ ఆ డౌట్ పెట్టుకోవద్దు. పొలిటికల్ గా నేను అనుకున్న లక్ష్యాలను సేవ భావాలను ముందుకు తీసుకెళ్లేందుకు “పవన్ కళ్యాణ్” ఉన్నాడు. అంటూ మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10