AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మర్యాద పూర్వకంగా కలిసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న డా. బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గావించనుందన్నారు.

అనంతరం కేసీఆర్‌తో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతితంగా ప్రతీఒక్కరిని తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనేది ఉద్దేశమన్నారు. ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని కేవలం ఆహ్వానం మేరకే పరిమితమయ్యామన్నారు. వారితో పాటు ప్రొటోకాల్‌ చైర్మన్‌ వేణుగోపాల్, డైరెక్టర్‌ వెంకట్రావ్, గజ్వేల్‌ ఆర్డీఓ చంద్రకళ పాల్గొన్నారు

ANN TOP 10