AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. పేదలకూ సన్న బియ్యం సరఫరా..

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు.

మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది.

ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా, సన్న బియ్యం సరఫరా సాగిస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.20వేల కోట్లతో ధాన్యం సేకరణ లక్ష్యంగా ఎంచుకోగా, ఈ సీజన్ లో 150 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయంతో పేద ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది.

ANN TOP 10