AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కుటుంబ సభ్యులది సంసారం.. వేరేవారిది వ్యభిచారమా?.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం కేసీఆర్   కుటుంబంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్   సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బూతు పురాణం కుటుంబమని.. ఉదయం లేస్తే చాలు ఆ పార్టీ నేతలు అందరూ బూతులే మాట్లాడుతారన్నారు. వాళ్లు చేస్తే సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడతారంటూ మండిపడ్డారు. కేసీఆర్ తిట్టినట్లు బూతులు ఎవరు తిట్టలేదని.. తండ్రి లాగే కొడుకు కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. ‘‘బూతులు తిట్టేవాడు నోటీసిస్తే దానికి విలువ ఉంటుందా. నేనెప్పుడూ తిట్టలేదు.. కేవలం విమర్శ మాత్రమే చేశాను. కేటీఆర్ పంపిన నోటీసుకు నేను సమాధానం కూడా ఇచ్చాను.. అంతేకాదు నోటీసుకు నోటీసు కూడా ఇచ్చాను’’ అని తెలిపారు.

అలాగే జన్వాడ ఫామ్‌ హౌస్ ఘటనకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. ‘‘ఫామ్ హౌస్‌లో దావతులు పెట్టడానికి సిగ్గుండాలి . దసరాకి దావతులు చేసుకుంటారు… దీపావళికి ఎవరైనా దావతులు చేసుకుంటారా. దీపావళికి దావతులు కాదు.. లక్ష్మీ పూజలు చేసుకోవాలి’’ అంటూ హితవుపలికారు.

అలాగే రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఆర్‌ కే హెచ్‌ సర్కార్ నడుస్తోంది (రేవంత్, కేటీఆర్, హరీష్ రావు) అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో బావా బామ్మర్దుల పంచాయతీ నడుస్తోందన్నారు. కేసీఆర్ కొడుకుకి ట్విట్టర్ టిల్లు అని పేరు పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అని అన్నారు.

ANN TOP 10