AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేసేందుకు రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రేపటి నుంచి నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనతో హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేసేందుకు రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

శాంతియుతంగా నిరసన చేసేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసుల జులం నశించాలంటూ గ్రూప్-1 బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత కొద్దిరోజులుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. శనివారం కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధితులతో కలిసి ఆందోళన చేయడం సంచలనం రేపింది. తాజాగా విద్యార్థులు ఇవాళ నిరసన తెలిపేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రేపటి నుంచి పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ANN TOP 10