AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బరువుగా ఉందని వలలో భారీ చేప పడిందనుకున్నాడు.. చూస్తే బిగ్ షాక్..

వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో.. ఎలుగూరు రంగంపేట పరిసరాల్లో వాగులో నీటిమట్టం పెరిగింది. ఆ వాగులో చేపలు కూడా భారీగా ఉండటంతో కొందరు చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మత్స్యకారులు కొందరు వాగులో వల వేసి చేపల వేట సాగించారు. ఈ క్రమంలో వాగులో వల వేసిన కాసేపటి తరువాత బరువుగా అనిపించింది. వలను బయటకు లాగే ప్రయత్నం చేయగా.. చాలా కష్టంగా అనిపించింది. దీంతో భారీ చేప పడినట్లుందని మత్స్యకారులు సంబరపడిపోయారు. ఓ నలుగురు కలిసి ఆ వలన బలంగా బయటకు లాగారు.. మెళ్లగా వల వాగు నుంచి బయటకు వస్తోంది. మత్స్యకారుల్లో ఆనందం మరింత రెట్టించింది.

మత్స్యకారుల ముఖాల్లో అప్పటి వరకు వెలిగిన చిరునవ్వుల వెలుగులు.. క్షణకాలంలో మాయం అయ్యాయి. సంతోషం స్థానంలో భయం పట్టుకుంది. అవును.. వలను బయటకు లాగితే అందులో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అది చూసి మత్స్యకారులు హడలిపోయారు. భారీ స్థాయిలో ఉండటంతో.. వలను బయటకు తీసి పక్కన పెట్టారు. భారీ కొండ చిలువ వలకు చిక్కిందన్న సమాచారం ప్రచారమవడంతో.. ఆ కొండచిలును చూసేందుకు స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. భారీ కొండ చిలువను చూసి జనాలు షాక్ అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాగే భారీ కొండచిలువ మత్స్యకారుల వలకు చిక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు రెండోసారి కొండ చిలువ చిక్కడంతో.. వాగు వైపు వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ANN TOP 10